టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన అన్ని చోట్లా మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో.. ‘భగవంత్ కేసరి’ చిత్రబృందం హీరో నందమూరి బాలకృష్ణను కలుసుకుంది. వీరిలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల, కెమరామెన్ రాంప్రసాద్, నిర్మాతలు మరియు ఇతర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు హీరో బాలకృష్ణకు పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భగవంత్ కేసరి’కి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని, బాలయ్య అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం మూవీ చూసి బావుందని అంటున్నారని ఆయనకు వివరించారు. కాగా ఇదిలా ఉండగా.. మరోవైపు క్రిటిక్స్ కూడా ఇలాంటి టైపు క్యారక్టర్ బాలకృష్ణ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదని, సినిమాలో ఆయన నటన సటిల్డ్‌గా ఉందని ప్రశంసిస్తున్నారు. దీంతో ‘భగవంత్ కేసరి’ చిత్రబృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటోంది.
The team of #BhagavanthKesari met #NandamuriBalakrishna and expressed their happiness after scoring the #BlockbusterDawath at the cinemas❤️🔥❤️🔥
Book your tickets now!
– https://t.co/JWvaOHzT4W@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7… pic.twitter.com/N2F1P1yDH1— Telugu FilmNagar (@telugufilmnagar) October 19, 2023
ఇక సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి పాత కథే అయినా కొత్తగా చెప్పిన విధానం, కథనం అందరినీ మెప్పించిందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని అర్ధవంతమైన డైలాగ్స్, ఎమోషన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాయని టాక్ నడుస్తోంది. అలాగే ఇందులో తన మునుపటి సినిమాల వలే కాకుండా ఒక సాత్వికమైన నటనతో బాలకృష్ణ ఆకట్టుకున్నారని, దీనితోపాటు మొదటిసారిగా బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం చాలా కొత్తగా ఉందని కూడా వారు అంటున్నారు. మరోవైపు సినిమాలో శ్రీలీల నటన అద్భుతంగా వుందని, బాలకృష్ణకు ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ అని చెప్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ప్లస్ అయిందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవల్ అని, ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో థమన్ అదరగొట్టాడని అంటున్నారు. కాగా ఈ సినిమా దసరా పండగ సందర్భంగా విడుదలవ్వటం, బాగుందనే టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: