యూఎస్ఏలో భగవంత్ కేసరి సంచలనం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Bhagavanth Kesari Collects Gross Over $650K in USA on Day 1

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్ ప్లే చేశారు. కాగా ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన అన్ని చోట్లా మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో.. ‘భగవంత్ కేసరి’ ఓవర్‌సీస్‌లో సైతం భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో తొలిరోజు యూఎస్‌లో ‘భగవంత్ కేసరి’ 650K డాలర్స్​కు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం యూఎస్‌లో ఎంత కలెక్ట్ చేసిందో వెల్లడించారు. కాగా ఈ సినిమా దసరా పండగ సందర్భంగా విడుదలవ్వడం, అలాగే బాగుందనే టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతోంది. దీనికితోడు నేటినుంచి మంగళవారం వరకు లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ‘భగవంత్ కేసరి’ భారీగా కలెక్షన్లు కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించి ఉండటంతో ఈ సినిమా నిర్మాతలు మంచి లాభాలు అందుకోనున్నారు.

కాగా ఇదిలా ఉంటే.. ఈ సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి పాత కథే అయినా కొత్తగా చెప్పిన విధానం, కథనం అందరినీ మెప్పించిందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని అర్ధవంతమైన డైలాగ్స్, ఎమోషన్ సీక్వెన్స్‌ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఇక ఇందులో తన మునుపటి సినిమాల వలే కాకుండా ఒక సాత్వికమైన నటనతో బాలకృష్ణ ఆకట్టుకున్నారని, దీనితోపాటు మొదటిసారిగా బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం చాలా కొత్తగా ఉందని కూడా వారు అంటున్నారు.

అలాగే మరోవైపు సినిమాలో శ్రీలీల నటన అద్భుతంగా వుందని, బాలకృష్ణకు ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ అని చెప్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ప్లస్ అయిందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవల్ అని, ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో థమన్ అదరగొట్టాడని అంటున్నారు. సో.. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘భగవంత్ కేసరి’ కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాలకృష్ణ చాలా రోజుల తర్వాత హ్యాట్రిక్ కొట్టాడని అభిమానులు సంబరపడుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.