రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘అదుర్స్’ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభిమానం చేయగా.. ఆయన సరసన నయనతార, షీలా హీరోయిన్స్‌గా నటించారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మరో కీలక పాత్రను పోషించారు. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్‌పై వల్లభనేని వంశీ మోహన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘అదుర్స్’ మూవీ 13 ఏళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 18న ఈ సినిమా రీ వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ‘అదుర్స్’ మూవీ రీ రిలీజ్ టీజర్‌ను విడుదల చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సీన్స్ ఇప్పుడు టీవీలలో వస్తున్నా ఆడియెన్స్ నవ్వుల జల్లుల్లో తడిసిపోతారు. అప్పటివరకు సీరియస్ రోల్స్‌లో, యాక్షన్ హీరోగా నటించిన తారక్.. తొలిసారి ఈ సినిమాలో తనలోని కామెడీ టైమింగ్‌ను బయటపెట్టారు. కాగా ఎన్టీఆర్ ‘బాద్‌షా’ సినిమా కూడా గత నవంబర్‌లో రీ రిలీజైన విషయం తెలిసిందే.
The ultimate comedy and action entertainer is all set to grace Big Screens again!🤩#Adhurs re-release TEASER OUT NOW! 🔥
– https://t.co/XZo6AeWmBE#AdhursReRelease From Nov18th Worldwide 💥@tarak9999 #Nayanthara #Sheela #Brahmanandam #VVVinayak @konavenkat99 @ThisIsDSP… pic.twitter.com/f0fwvHMs5v— Telugu FilmNagar (@telugufilmnagar) October 19, 2023
ఇక ఎన్టీఆర్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఈ తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ భారీ చిత్రం చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: