ట్రైలర్‌లో చూపించింది గోరంతే – నందమూరి బాలకృష్ణ

Balakrishna Speech in Bhagavanth Kesari Trailer Launch Event

‘ట్రైలర్‌లో చూపించింది గోరంతే.. సినిమాలో అంతకుమించి ఉంటుంది’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్ తొలిసారి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోందగా.. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ నెగటివ్ రోల్‍ పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ‘భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ వరంగల్ లోని హన్మకొండ వేదికగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ నిర్వహించింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్స్, దర్శకుడు మరియు ఇతర తారాగణం పాల్గొన్నారు. వీరితో పాటు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ బాబీ, మలినేని గోపీచంద్‌, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “వరంగల్‌ పోరాటాల పురిటిగడ్డ. ఈ ప్రాంతం కళలకు నెలవు. ఇక్కడి ఓరుగల్లు వెయ్యి స్థంభాల గుడి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు.. కోట్లాదిమంది పూజలు జరిపే ‘సమ్మక్క సారలమ్మ’, ‘ములుగు నరసింహస్వామి’, భద్రకాళి తల్లి ఇక్కడ కొలువుదీరి ఉన్నారు” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “చెప్పాలంటే.. ఆ భద్రకాళి తల్లే నన్ను ఇక్కడికి పిలిపించింది. ఆ అమ్మ నిర్ణయమే ఇక్కడ జరుగుతున్న ఈ వేడుక. తెలంగాణ సాయుధ పోరాటయోధులు సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డపై మా సినిమా వేడుక జరగడం అదృష్టంగా భావిస్తున్నా. అఖండ’ సినిమా తర్వాత తర్వాత ఏం చేయాలి? అనుకున్నా.. అప్పుడు ‘వీరసింహారెడ్డి’ రూపంలో మంచి కథ దొరికింది. దీని తర్వాత ఏంటి? అని మళ్ళీ సందిగ్ధంలో ఉన్నప్పుడు ‘భగవంత్‌ కేసరి’ దొరికాడు. అంతా ఆ భద్రకాళి తల్లి చలవే” అని తెలిపారు.

“అనిల్‌ రావిపూడి సినిమాల్లో కామెడీ బాగా ఉంటుంది. అయితే ఇందులో మాత్రం కామెడీతో పాటు అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. ట్రైలర్‌లో ఉంది గోరంతే.. అసలు పండగ ముందుంది, దసరాకి ప్రేక్షకులకు డబుల్‌ ధమాకానే. ఈ చిత్రంలో శ్రీలీల చిరస్థాయిగా గుర్తుండిపోయే అద్భుతమైన పాత్ర చేసింది. ఈ సినిమాలోని భావోద్వేగాలు మగవాళ్లకు సైతం కన్నీరు తెప్పించేలా ఉంటాయి. అన్ని పరిశ్రమలను గుర్తించినట్టే సినిమా పరిశ్రమను కూడా ప్రభుత్వాలు గుర్తించాలి. అప్పుడే సినిమారంగం నిలబడుతుంది. జై తెలంగాణ”అని తన ప్రసంగాన్ని ముగించారు బాలకృష్ణ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + nine =