ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కి తమకు నచ్చిన పాత్రలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు.. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమ ఇంట్రెస్ట్ ను బయటపెడుతుంటారు. ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తానని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వన్డే వరల్డ్ కప్ మ్యాచెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే నిన్న ఆస్ట్రేలియా ఇంకా ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ మరోసారి తన మెరుపును చూపించాడు. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా మాస్ మహారాజా రవితేజ కామెంటరీ బాక్స్ లో కనిపించి కాసేపు సందడి చేశారు. ఈ సందర్బంగా తనకు కోహ్లీ యాటిట్యూడ్ ఇంకా ఎగ్రేషన్ అంటే ఇష్టమని.. తన బ్యాట్ పట్టుకునే పద్దతి కూడా ఇష్టమని తెలిపాడు. ఇంకా సిరాజ్ కూడా ఇష్టం.. ఎప్పుడైనా ఏదైనా క్రికెటర్ బయోపిక్ చేయాలనే ఛాన్స్ వస్తే సిరాజ్ బయోపిక్ చేస్తా అంటూ మరో షాకింగ్ విషయాన్ని తెలియచేసాడు. చూద్దాం మరి రవితేజ అయితే తన ఇష్టాన్ని తెలియచేశాడు.. అందుకు తగ్గట్టుగా ఎవరైనా కథను రెడీ చేస్తారేమో..
ప్రస్తుతం రవితేజ వరుసగా సినిమాలు చేసుకుంటూ వాటిని రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ధమాకా, రావణాసుర సినిమాలను రిలీజ్ చేయగా వాటిలో ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోగా రావణాసుర అనకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు. ఈసినిమా ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కుతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: