సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ఈసినిమా గురించి చెప్పిన విషయాలతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. త్రివిక్రమ్ స్టోరీ, టేకింగ్ తో పాటు థమన్ మ్యూజిక్ అన్నీ ఓ రేంజ్లో ఉన్నాయని.. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అలానే ప్రేక్షకులందరికీ ఫుల్ ఫీస్ట్ అందిస్తుంది అంటూ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు.
ఇక ఇప్పుడు ఈసినిమా గురించి యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దూ కూడా అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సందర్భంగా సిద్దూ గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ.. చినబాబు గారు నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు.. ఈసినిమాలో ఒక సూపర్ సాంగ్ ను ఈరోజు షూట్ చేశారు..ఈ పాటకు ఖచ్చితంగా థియేటర్లు తగలబడిపోవడం ఖాయం అని చెప్పారు.. నిజానికి చినబాబు గారు ఎక్కువ మాట్లాడరు.. అలాంటిది ఆయన చెప్పారంటే పాట ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి అని అన్నాడు. మరి సిద్దూ ఇచ్చిన అప్ డేట్ మహేష్ ప్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. మరి ఆ పాట ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Star boy #SidduJonnalagadda teases fans & amplifies the excitement for #GunturKaaram!!🔥🌟#MaheshBabu #Sreeleela #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/JTJ68ziakV
— Telugu FilmNagar (@telugufilmnagar) October 4, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: