దసరా తరువాత నాని హీరోగా రాబోతున్న ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్ హాయ్ నాన్న. టైటిల్ ను బట్టే ఈసినిమా ఎమోషనల్ రైడర్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. పాథర్ అండ్ డాటర్ బాండింగ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మరి ఎమోషనల్ కంటెంట్ అంటే నాని ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే సమయమా అనే సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు. గాజు బొమ్మ అనే సాంగ్ ను రేపు అంటే ఆక్టోబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నారు.. అయితే తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది.
Promo 🙂#GaajuBomma ♥️#HiNanna pic.twitter.com/gPFWyCLHQu
— Nani (@NameisNani) October 5, 2023
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































