సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ అలానే పోసర్లు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ట్రైలర్ కోసం. అయితే తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 8వ తేదీన ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Gear up for #BhagavanthKesari’s explosive extravaganza Like Never Before💥
TRAILER OUT ON OCT 8th❤️🔥
This time, beyond your imagination🔥
In Cinemas from October 19th😎#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @rampalarjun @sahugarapati7… pic.twitter.com/pQn1SFH84J
— Telugu FilmNagar (@telugufilmnagar) October 5, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: