బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సినిమాలపై నిర్మాత నాగ‌వంశీ కీలక అప్‌డేట్స్

Producer Naga Vamsi Gives Key Updates About Balakrishna and VD12 Movies

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ మరియు క్రేజీ హీరో విజయ్ దేవరకొండలతో నిర్మించనున్న సినిమాలకు సంబంధించి కీలక అప్‌డేట్స్ వెల్లడించారు ఆయా చిత్రాల నిర్మాత సూర్యదేవర నాగవంశీ. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల, మీనాక్షిచౌదరి కథానాయికలుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా తమ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఇతర చిత్రాల గురించి నాగవంశీ మాట్లాడుతూ.. “విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. శ్రీలీల స్థానంలో రష్మిక మందన్నాను తీసుకున్నామని ఇటీవల వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఈ విషయమై మేము అసలు ఆమెను సంప్రదించలేదు. మరోవైపు నందమూరి బాలకృష్ణతో త్వరలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాం. అది ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక వీటితో పాటుగా వైష్ణవ్‌ తేజ్‌ తో ‘ఆదికేశవ’, విశ్వక్‌ సేన్‌ తో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, సిద్థు జొన్నలగడ్డ తో ‘టిల్లు స్వ్కేర్‌’ సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటి తర్వాత, అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా, అలాగే జూ.ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తెలియజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + one =