ఈ ఏడాది ఇప్పటికే వారసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు దళపతి విజయ్. ఇప్పుడు లియో అంటూ వచ్చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కగా ఈసినిమాకోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Order is being prepared 😎#LeoTrailer is on its way! Get ready to enjoy your meal 🔥#LeoTrailerFromOct5
Thalapathy @actorvijay @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio #Leo #TeluguFilmNagar pic.twitter.com/j1MIHRHwae
— Telugu FilmNagar (@telugufilmnagar) October 2, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: