స్కంద రివ్యూ- బోయపాటి కల్ట్ మాస్ జాతర

skanda movie telugu review

నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల,శ్రీకాంత్
ఎడిటింగ్ : తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ :సంతోష్ దేటేక్
సంగీతం : థమన్
దర్శకత్వం : బోయపాటి శ్రీనివాస్
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ సినిమాలను తీయడంలో దిట్ట డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్.హీరోను ఏవిధంగా చూపించాలో ఎలా ఫైట్స్ చేయించాలో తనకు బాగా తెలుసు.బ్లాక్ బాస్టర్ అఖండ తరువాత బోయపాటి ,రామ్ పోతినేనితో స్కంద తీశాడు.ఇందులో హీరోయిన్ శ్రీ లీల కావడంతో ఈసినిమా పై హైప్ మరింత గా పెరిగింది.అలాగే స్కంద నుండి విడుదలైన ట్రైలర్లు ,సాంగ్స్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ముఖ్యంగా బి,సి సెంటర్ల ప్రేక్షకులు ఈసినిమా కోసం ఆతృతగా ఎదురుచూశారు.ఈ సినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.మరి స్కంద ఎలా వుంది? అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.

కథ :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూతుర్ని ,తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు పెళ్లి మధ్యలో నుండి తీసుకెళ్లి పోతాడు.ఈ సంఘటన తో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వైరం ఏర్పడుతుంది.ఇక రామ్ (రామ్ పోతినేని) అనే  కుర్రాడు సిటీలోకి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు శ్రీ లీలతో స్నేహం పెంచుకుంటాడు. ఆ తరువాత ఆమెను కిడ్నాప్ చేస్తాడు.అలా రెండు రాష్ట్రాల సీఎంల కూతుళ్లు ఎందుకు కిడ్నాప్ అవుతారు?ఇంతకీ ఎందుకు అలా  చేయాల్సివచ్చింది.ఈ కిడ్నాప్ లకి  క్రౌన్ గ్రూప్ ఛైర్మెన్ రుద్రగంటి రామ కృష్ణం రాజు( శ్రీకాంత్) కు సంబంధం ఏంటి ? అసలు రామ్ ఎవరు? అనేది మిగితా కథ.

విశ్లేషణ :

బోయపాటి శ్రీనివాస్ సినిమాలంటే పెద్ద లాజిక్ లు మెదడుకు పని పెట్టె స్క్రీన్ ప్లై ఇవేవీ వుండవు.సింపుల్ స్టోరీ ని తనదైన స్టయిల్లో ప్రజెంట్ చేసి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు.ఈఫార్ములా చాలా సార్లు సక్సెస్ అయ్యింది.ఇప్పుడు స్కందకు కూడా మరోసారి ఇదే మ్యాజిక్ చేశాడు.తన సినిమానుండి ప్రేక్షకులు ఏం ఆశించి వెళ్తారో అవి ఉండేలా చూసుకున్నాడు.ఆ విషయం లో ఎక్కడా డిస్సపాయింట్ చేయలేదు.ముఖ్యంగా రామ్ ను చూపెట్టిన విధానం బాగుంది.ఎంట్రీ సీన్ దగ్గర నుండి  రామ్ ఫ్యాన్స్ కు ఏం కావాలో అది ఇచ్చాడు.

ఇక ప్రీ ఇంటర్వెల్ అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అదరగొట్టాయి. ఈ సీన్స్ కి థియేటర్లలో విజిల్స్ పడుతాయి.ఈసీక్వెన్స్,సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచాయి.సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా నిరాశపరిచదు.ఫ్యామిలీ డ్రామా తో  సాగిపోతుంది. క్లైమాక్స్ ను బాగా డీల్ చేశాడు అంతే కాదు స్కంద కు సీక్వెల్ కూడా ఉండనుంది అని హిట్ ఇచ్చారు. ఇక ఫైట్స్ విషయంలో బోయపాటి తన బలాన్ని మరోసారి చూపెట్టాడు.యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి.రామ్ కు డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ ను క్రియేట్ చేసి పంచ్ డైలాగ్స్ చెప్పించాడు.ఇది కూడా ఫ్యాన్స్ బాగా నచ్చుతుంది.యాక్టింగ్ తోపాటు డ్యాన్సింగ్ విషయంలో రామ్ కు తిరుగులేదని తెలిసిందే.శ్రీ లీల డ్యాన్స్ ఏంటో కూడా ఇంతకుముందు చూశాం.వీరిద్దరూ ఈ విషయంలో పోటీపడ్డారు.ముఖ్యంగా ఘండర భాయ్ సాంగ్ లో రామ్ డ్యాన్స్ అద్భుతం.

నటీనటుల విషయానికి వస్తే రామ్ ..డాన్స్ ,ఫైట్స్ ,యాక్టింగ్ ఇలా ప్రతి దాంట్లో తన ట్యాలెంట్ చూపెట్టాడు. ఈసినిమా కోసం బరువు పెరిగాడు లుక్ కూడా చాలా బాగుంది.అంతేకాదు స్క్రీన్ పై చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. శ్రీ లీల గ్లామర్ గా కనబడడమే కాదు డ్యాన్స్ తో  మెప్పించింది.మిగితా కీలక  పాత్రల్లో నటించిన శ్రీకాంత్, శరత్ లోహితశ్వ ,దగ్గుబాటి రాజా అనుభవాన్ని చూపెట్టారు.

టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ గా బోయపాటి ఎక్కడా నిరాశపరచలేదు తన నుండి ఏం ఆశిస్తారో అవి ఇచ్చాడు.రామ్ ను ఊర మాస్ అవతారంలో చూపించాడు.ఇక థమన్ సంగీతం,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.అలాగే సినిమాటోగ్రఫీ ,ఎడిటింగ్  బాగుంది.నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

ఓవరాల్ గా బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో రామ్ నటన,ఫైట్స్ ,డ్యాన్స్ ,ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్  సీన్స్,క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.మంచి మాస్ మాసాల ఎంటర్టైనర్ చూడాలనుకుంటే స్కంద ను చూసేయచ్చు.పక్కా ఎంటర్టైన్ చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + eleven =