స్కంద కోసం రామ్ ఎన్ని కిలోలు పెరిగాడంటే

ram gained weight for skanda

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ సినిమాల్లో ఫైట్స్ చేయాలంటే హీరోలు కష్టపడి కండలు పెంచాల్సిందే. బోయపాటి సీనియర్ హీరోలకు ఈరూల్ ను పాటించడు కానీ మిగితా హీరోలకు దాదాపు ఫాలో అవుతాడు.సరైనోడు,జయ జానకి నాయక ,వినయ విధేయ రామల్లో హీరోలు కండలు పెంచి మంచి ఫిజిక్ తో కనబడతారు.ఇంకా ఫైట్స్ చెప్పనక్కర్లేదు.ఓ రేంజ్ లో ఉంటాయి.బోయపాటి ఫైట్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు.ఇక యంగ్ హీరో రామ్ కు కూడా స్కంద ముందు కండలు పెంచాలనే రూల్ పెట్టాడట.దాంతో ఈసినిమా కోసం రామ్ ఏకంగా 12కిలోలకు బరువు పెరిగాడట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాకు ముందు రామ్ 72కిలోలు ఉండగా ఈసినిమా కోసం 84 కిలోలకు వచ్చాడట.కానీ తన కష్టం ఎక్కడికి పోలేదు.స్కంద లో రామ్ లుక్ అదిరిపోయింది.ట్రైలర్ చూస్తూనే తెలుస్తుంది రామ్ ఎంతలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడో.బోయపాటి రామ్ ని ఇంతకుముందు ఎవరు చూపెట్టని విధంగా చూపించనున్నాడు.ఇక రీసెంట్ గా రిలీజైన సెకండ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ కు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.

రేపే ఈసినిమా తెలుగుతోపాటు తమిళ,కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఊర మాస్ సినిమా చూసి చాలా రోజులవుతుంది దాంతో ఈసినిమా కోసం బి,సి సెంటర్ల ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.మరి స్కంద రిజల్ట్ ఏంటో మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =