స్కంద 2 పై బోయపాటి హింట్.. ఫ్యాన్స్ స‌ర్‌ప్రైజ్

Boyapati Sreenu Gives Hint on Part 2 of Skanda Movie

మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను, ఉస్తాద్ రామ్‌ పోతినేని క‌ల‌యిక‌లో రూపొందిన ‘స్కంద’ సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలినుంచీ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల కారణంగా విడుదలైన అన్నిచోట్లా ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రిలీజైంది. ‘మేజర్’ ఫేమ్ సయీ మంజ్రేకర్‌, సీనియర్ నటులు దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రాన్ని ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక రామ్ పోతినేని కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో న‌టించిన సినిమా ఇదే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా స్కందలో రామ్ క్యారెక్ట‌ర్‌ డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో సాగింది. ఆయన అభిమానుల‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను కూడా మెప్పించేలా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు బోయపాటి. సినిమాను చూసిన ఆడియెన్స్ కూడా ఇది కంప్లీట్ బోయ‌పాటి శ్రీను స్టైల్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ అని కామెంట్స్ చేస్తున్నారు. క‌థ పరంగా రొటీన్‌గానే ఉన్నా మాస్ సీన్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో డైరెక్ట‌ర్ విజువల్ ట్రీట్ ఇచ్చాడని అంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్ బీజీఎమ్‌తో సినిమాలోని అనేక సీన్స్ గూజ్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని, పాటల్లో అయితే రామ్, శ్రీలీల డ్యాన్స్ అడియాగోట్టారని ప్ర‌శంస‌లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

‘స్కంద’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ మేరకు స్కంద సినిమా క్లైమాక్స్‌లో దీనిపై హింట్ ఇచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీను. సినిమా చివర్లో ఒక ఆసక్తికరమైన పాత్రని పరిచయం చేసి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది, ‘స్కంద 2’ వస్తుంది అని చెప్పించారు. ఇక ‘స్కంద 2’ ఉంటుంద‌ని అనౌన్స్‌ చేయడం ద్వారా ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌తో రామ్ ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఇదిలాఉంటే మరోవైపు స్కంద త‌ర్వాత నందమూరి బాల‌కృష్ణ‌తో ‘అఖండ’ సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు బోయ‌పాటి శ్రీను. సో.. ‘స్కంద 2’ సెట్స్‌పైకి రావాలంటే, ముందుగా ‘అఖండ 2’ పూర్తయ్యేవరకూ ఆగాల్సి రావొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.