బగ్ బాస్ 7- నాలుగో వారం పవరాస్త్ర కోసం పోటీ

bigg boss telugu season 7 day 24 highlights

బగ్ బాస్ 7 నాలుగో వారం నామినేషన్స్ చాలా రసవత్తరంగా జరిగాయి. హౌస్ మేట్ల మధ్య గొడవలు పీక్స్ కు వెళ్లాయి. రెండు రోజులు జరిగిన నామనినేషన్ ప్రాసెస్ లో నాలుగో వారంలో తేజ, గౌతమ్, శుభశ్రీ, రతిక, ప్రియాంక, ప్రిన్స్ నామినేషన్ లోకి వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మూడు వారాలు ఇంటిసభ్యుడిగా అర్హత సాధించడానికి పలు టాస్క్ లతో అలరించిన బిగ్ బాస్ ఈ వీక్ కూడా పవరాస్త్ర కోసం పలు టాస్క్ లతో వచ్చేశాడు. దీనిలో భాగంగానే ఈవారం మొదటి టాస్క్ తో వచ్చేశాడు. ఇప్పటికే పవరాస్త్రను గెలిచిన ముగ్గురు కంటెస్టెంట్స్ సందీప్, శోభా శెట్టి, శివాజీ లను బ్యాంకర్స్ గా నియమిస్తాడు బిగ్ బాస్. వీరి ముగ్గురికి ఒక్కోక్కరికీ 10వేల బీబీ కాయిన్స్ ఇస్తాడు. వాటిని మిగిలిన హౌస్ మేట్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి కాయిన్ విలువ 100 రూపాయలు ఉంటుంది. ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కబెట్టి వాటిని తమ లాకర్లు లో దాచాలని చెప్పారు. ఆతర్వాత ఆడే గేమ్స్ ను బట్టి తమ దగ్గరున్న కాయిన్స్ పెంచుకోవడం లేదా తగ్గిపోవడం జరుగుతుందని..ఆట పూర్తయ్యేసరికి ఏ కంటెస్టెంట్ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారే గెలుస్తారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన బీబీ కాయిన్స్ ను సందీప్, శోభా, శివాజీ హౌస్ మేట్లకు కాయిన్స్ ఇస్తారు. తమ ఫ్రెండ్స్ అనుకున్న వారికి కాస్త ఎక్కువ కాయిన్స్ ఇచ్చుకున్నారు.

మరోవైపు బిగ్ బాస్ మొదటి టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే ఏటీఎం బజర్ ను మొదట ప్రెస్ చేస్తారో.. వారు తన పార్ట్ నర్ ను ఎంచుకోవడంతో పాటు తమ ప్రత్యర్థిని సైతం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో అమర్ దీప్ మొదటగా బజర్ ను నొక్కడంతో అమర్ దీప్ తన పార్ట్ నర్ గా గౌతమ్ ను అలానే ప్రత్యర్థులుగా తేజ రతికను ప్రత్యర్థులుగా ఎంచుకున్నాడు. ఇక వీరికి స్మైలీ ప్లీజ్ అనే ఒక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక జంట ఫొటోలు దిగుతుంటే.. మరో జంట అడ్డుకోవాలి. ఈ టాస్క్ కు శివాజీ ఫొటోగ్రాఫర్ గా, సందీప్ సంచాలకుడిగా నిర్వహించారు.

ఈగేమ్ లో రెండు జంటలు గట్టిగానే పోటీ పడ్డాయి. ముందు రతిక-తేజ ఆడి కేవలం 7సార్లు మాత్రమే ఫొటోలు దిగారు. ఆ తరువాత గౌతమ్-అమర్ దీప్ 14 సార్లు దిగి విజయం సాధించారు. దీంతో రతిక-తేజ దగ్గర ఉన్న కాయిన్స్ ను గెలిచిన అమర్-గౌతమ్ కు ఇచ్చేస్తారు. ఈ టాస్క్ తో బుధవారం ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి బిగ్ బాస్ నేడు ఏం టాస్క్ లు ఇస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 16 =