బాలీవుడ్ నటి వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Waheeda Rehman Honoured with Dadasaheb Phalke Award For The Year of 2023

బాలీవుడ్ లెజెండరీ నటి, తొలితరం కథానాయిక వహీదా రెహ్మాన్‌కు అరుదైన గౌరవం లభించింది. సినీ రంగానికి సంబంధించి దేశ అత్యున్నత పురస్కారం అయిన ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’కు ఆమె ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సోమవారం ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా ఆయన దీనిని అధికారికంగా వెల్లడించారు. త్వరలో జరుగనున్న 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో వహీదాకు ‘దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బ‌హూక‌రించ‌నున్న‌ట్లు మంత్రి వివరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వహీదా రెహమాన్ జీ ఐదు దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన అద్భుతమైన సేవలు నిరుపమానమైనవి. అందుకు ఆమెకు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేస్తున్నట్లు ప్రకటిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు క‌మిటీలోని అయిదుగురు స‌భ్యులు ఈ సంవత్సరానికి గానూ వహీదా రెహమాన్ పేరును ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. వహీదా జీ హిందీ చిత్రాలలో తన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గైడ్, ప్యాసా, ఖామోషి, ఢిల్లీ 6, చౌదవి కా చాంద్, కాగజ్ కే ఫూల్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్ తదితర చిత్రాల‌లో వహీదా రెహమాన్ అద్భుతమైన నటనను కనబరిచారు” అని పేర్కొన్నారు.

కథానాయికగా తెలుగు చిత్రంతోనే ఎంట్రీ

అయితే వహీదా రెహమాన్ ఒక తెలుగు సినిమాలో నటించారనే విషయం బహుశా ఎక్కువమందికి తెలిసిఉండకపోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) నటించిన ‘రోజులు మారాయి’ అనే చిత్రంలో తొలిసారిగా సినీప్రయాణం ప్రారంభించారు. అందులోని ‘ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా’ అనే పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అనంతరం ‘జయసింహ’, ‘బంగారు కలలు’, ‘సింహాసనం’, ‘చుక్కల్లో చంద్రుడు’ తదితర చిత్రాల్లో నటించారు. అయితే ఆమె కెరీర్‌లో ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించారు.

కాగా 85 ఏళ్ల వహీదా చివరిసారిగా 2018లో కమల్‌హాసన్‌ తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’లో (కశ్మీరీ మదర్‌గా) మరియు ‘స్కేటర్ గర్ల్’ చిత్రాల్లో అతిథి పాత్ర‌ల్లో నటించారు. ఇక భారత ప్రభుత్వం వహీదా రెహ్మాన్‌ను 1972లో ‘పద్మశ్రీ’తో, 2011లో ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది. 1974లో శశిరేఖిని వివాహం చేసుకున్న వహీదా.. 2000 సంవత్సరంలో భర్త మరణానంతరం తన పిల్లలతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =