దిల్ రాజు ఎన్నో ఏళ్ల నుండి సినిమాలు నిర్మిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఇక ఒకవైపున సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో పెద్ద సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు యానిమల్. సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా యానిమల్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ టీజర్, టీజర్ ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబి డియోల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. అనిల్ కపూర్ బల్బీర్ సింగ్ పాత్రలో, రష్మిక మందన్న గీతాంజలి పాత్రలో నటిస్తుంది. ఇక రిలీజ్ వరకూ ఇలానే అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయనున్నారు.
ఇక ఈసినిమా తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చింది. అంతేకాదు దిల్ రాజు ఓకే చేశాడంటే సినిమాలో మ్యాటర్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో..
కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: