భారీ హైప్ క్రియేట్ చేస్తున్న స్కంద రిలీజ్ ట్రైలర్ 

Skanda release trailer generates a lot of excitement

ఉస్తాద్ రామ్- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న స్కంద  మరో  రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ కు పెట్టింది పేరు బోయపాటి శ్రీను.ఈసినిమాను కూడా అదే  జోనర్ లో తెరకెక్కించాడు.సాంగ్స్ అలాగే మొదట విడుదలైన ట్రైలర్ సినిమాకు మంచి  హైప్ ను క్రియేట్ చేసింది. అంతేకాదు యూట్యూబ్ లో అన్ని భాషల్లో కలిపి ట్రైలర్  50మిలియన్స్ కు పైగా వ్యూస్ ను రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు  విడుదలకు ముందు రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ ను వదిలారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఈట్రైలర్ తో సినిమాకు వున్న హైప్ ఆమాంతం పెరిగిపోయింది. నిన్న ఈట్రైలర్ ను రిలీజ్ చేయగా  ఇప్పటికే 10మిలియన్ వ్యూస్ ను  క్రాస్ చేసింది.సెకండ్ ట్రైలర్ లో రామ్ డైలాగ్స్,యాక్షన్ సీన్స్ ,థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.ట్రైలర్ లో రామ్ రెండు అటు తెలంగాణ స్లాంగ్ అలాగే రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పాడు. ఓవరాల్ గా విడుదలకు ముందు రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి  టీం అంచనాలు పెంచడం లో సక్సెస్ అయ్యింది.

ఇక ఈసినిమాతో రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్డడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ వారం ఈసినిమాతోపాటు చంద్రముఖి 2,పెదకాపు పార్ట్ 1 కూడా విడుదలకానున్నాయి.ఈరెండు సినిమాలకు  కూడా మంచి బజ్ వుంది. దాంతో స్కంద ఈరెండు సినిమాలతో పోటీఎదుర్కోనుంది.
స్కంద లో శ్రీ లీల, సయీ మంజ్రేకర్  హీరోయిన్లు గా నటించగా శ్రీకాంత్, శరత్ లోహితశ్వ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.శ్రీనివాస చిట్టూరి ఈసినిమాను  నిర్మించగా పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది. అటు బోయపాటి కి అలాగే రామ్ కు ఇదే మొదటి పాన్ ఇండియా రిలీజ్.మరి స్కంద వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =