ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన స్కంద మరో 20రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ముందు ఈసినిమాను ఈనెల 15న విడుదలచేయాలనుకున్నారు కానీ ఇంకాస్త ఎక్కువ టైం తీసుకొని ఈనెల 28న దింపుతున్నారు.ఇక ఈసినిమా ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.యూట్యూబ్ లో ఏకంగా 50మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టింది దాంతో సినిమా కూడా దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇదిలావుంటే ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.స్కందకు రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే వుంది.2గంటల 47నిమిషాల నిడివితో రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శ్రీ లీల హిరోయిన్ నటించగా బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనుంది.తమన్ సంగీతం అందించాడు.శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు.స్కంద తెలుగుతోపాటు హిందీ,తమిళ ,మలయాళ,కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఇక ఈసినిమాతోపాటు అదేరోజున మరో రెండు సినిమాలు కూడా విడుదలకానున్నాయి.అందులో కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ ఒకటి కాగా మరొకటి సితార ఎంటటైన్మెంట్స్ నిర్మిస్తున్న మ్యాడ్.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.మరి ఈరెండు స్కందకు ఎలాంటి పోటీనిస్తాయో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: