కొన్ని సినిమాలు రిలీజ్ అయి ఎన్నేళ్లయినా కూడా ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ రిపీట్ గా చూస్తునే ఉంటారు. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. యూట్యూబ్ లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వచ్చిన తరువాత ఏ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయొచ్చు. ఈ నేపథ్యంలోనే రిలీజ్ అయి 8 ఏళ్లు అయిపోతున్నా ఇంకా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది ఒక సినిమా. ఆ సినిమా మరేదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా యూట్యూబ్ లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈసినిమా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ యూ ట్యూబ్ ఛానల్ లో ఈసినిమా 200 మిలియన్ వ్యూస్ ను 834కె లైక్స్ ని కూడా సొంతం చేసుకుంది. దీంతో ఈ రికార్డు అందుకున్న తొలి టాలీవుడ్ మూవీగా శ్రీమంతుడు నిలిచిపోయింది.
8 Years passed & still Harsha is adopting records💥
Super 🌟 #MaheshBabu & #KoratalaSiva’s Sensational Non-BB Industry Hit Film #Srimanthudu becomes the First Telugu Full Movie to gain 200M views on YT!!🤩Watch Full Movie here – https://t.co/maqghkpGF7#200MViewsforSrimanthudu… pic.twitter.com/DMRLvrVVS6
— Telugu FilmNagar (@telugufilmnagar) September 7, 2023
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా 2015లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమా విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. మహేష్ నటన, కొరటాల కథ, దేవి సంగీతం ఈసినిమా విజయానికి ప్రధాన బలమయ్యాయి. శ్రీ తేకాదు ఈసినిమాతోనే ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఈసినిమా స్పూర్తితోనే మహేష్ కూడా ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తున్నాడు. కేవలం మహేష్ మాత్రమే కాదు ఇతరులు కూడా పలు గ్రామాలను దత్తత తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా అనేక అవార్డులను సైతం అందుకుంది. మహేష్ కు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , ఐఫా , సైమా అవార్డ్స్ అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































