రూల్స్ రంజన్ ట్రైలర్ రిలీజ్

Rules Ranjann movie trailer out now

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈరేంజ్ లో అవకాశాలు అందుకోవడం అంటే మాములు విషయం కాదు. కిరణ్ మాత్రం ఆ విషయంలో లక్కీ అనే చెప్పొచ్చు. జయాపజయాలతో సంబంధం లేకుండా కిరణ్ కు పెద్ద పెద్ద బ్యానర్లలోనే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రత్నం కృష్ణం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా రూల్స్ రంజన్. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ట్రైలర్ ను చూస్తుంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు మాస్ తో పాటు క్లాస్ లుక్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు. అలానే కిరణ్ ఇంకా నేహా శెట్టి ట్రాక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్టు కనిపిస్తుంది.

 

కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి ఈసినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =