తండ్రి హరికృష్ణను తలచుకుంటూ.. జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎమోషనల్ ట్వీట్స్

Jr NTR and Kalyanram Shares Emotional Post on Their Father Nandamuri Harikrishna

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌ మరియు ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ తమ తండ్రి నందమూరి హరికృష్ణని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు హరికృష్ణ జయంతి సందర్భంగా తనయులు ఇరువురూ సోషల్ మీడియా వేదికగా తమ తండ్రిని స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్స్ పంచుకున్నారు. కాగా నటుడు, పొలిటీషియన్ అయిన నందమూరి హరికృష్ణ 2018, ఆగస్ట్‌ 29న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తమ ఫ్యామిలీకి చెందిన ఓ అభిమాని పెళ్లికి హాజరవడం కోసం ఆయన నెల్లూరు జిల్లా కావలికి కారులో బయలుదేరగా.. మధ్యలో నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తీవ్ర గాయాలపాలై మరణించారు. అయితే అదే కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఆ రోజు ఉదయం లేవగానే ఈ వార్త నందమూరి అభిమానులకు అశనిపాతంలా తగిలింది. ఇక ఆ సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులు హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అయితే చంద్రబాబు నాయుడు, హరికృష్ణకు స్వయానా బావ అన్న విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. ఇక హరికృష్ణకు మొత్తం ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు జానకీరామ్ కూడా అంతకుముందే మరో రోడ్డు ప్రమాదంలో మరణించడం గమనార్హం. కాగా నేడు హరికృష్ణ 67వ జయంతి సందర్భంగా.. జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఇద్దరూ తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ట్వీట్స్ పోస్ట్‌ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =