సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ గత నెల 10న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 600కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేయడమే కాదు రజినీ స్టామినా ఏంటో చూపెట్టి ట్రాక్ లోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది.ఈనెల 7నుండి అమెజాన్ ప్రైమ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది. అయితే జైలర్ ఇప్పటికీ తమిళనాడు లో మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో యోగి బాబు,రమ్యకృష్ణ,వసంత్ రవి కీలక పాత్రల్లో నటించగా స్టార్ యాక్టర్లు శివరాజ్ కుమార్,మోహన్ లాల్,జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో మెరిశారు.అనిరుధ్ సంగీతం అందించాడు.సన్ పిక్చర్స్ నిర్మించింది.
ఇక ఈసినిమాకు ఊహించని విధంగా లాభాలు రావడం తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ రజినీకాంత్ కు చెక్ తోపాటు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు చెక్ తోపాటు పోర్షే కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: