హాయ్ నాన్న షూటింగ్ అప్డేట్ 

hi nanna new schedule started

ఈసమ్మర్ లో దసరాతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని.రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.నాని కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల సినిమా.ఇక ఈసినిమా తరువాత నాని నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.కేవలం గ్లింప్స్ తోటే సినిమాకు హైప్ తెప్పించింది చిత్ర బృందం.ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాఫై అంచనాలను పెంచేసింది.ఇక ఈరోజు నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. కూనూర్ లో ఈ షెడ్యూల్  జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

సెప్టెంబర్ చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసి సినిమాను అనుకున్నా ప్రకారం డిసెంబర్ 21న విడుదలచేయాలని మేకర్స్ భావిస్తున్నారు.అలాగే త్వరలోనే  సినిమానుండి మొదటి సాంగ్ రిలీజ్ చేయనున్నారు.పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కైరా కన్నా,నాని కూతురిగా కనిపించనుంది.శౌర్యువ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.అతనికిదే మొదటి సినిమా.ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.