తమిళ హీరో ధనుష్,టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈసినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి.తాజాగా మేకర్స్ కూడా ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగార్జున ఈసినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలిపారు.నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.దాంతో ధనుష్, నాగార్జున కలిసి నటించనుండడం తో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుండగా పుస్కూర్ రామ్ మోహన్ ,ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ధనుష్ కు ఇది 51వ సినిమా కానుంది.
ఇదిలావుంటే ధనుష్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో కెప్టెన్ మిల్లర్ ఒకటి. ఇటీవల విడుదలైన ఈసినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.డిసెంబర్ 15న విడుదలకానుంది.ఈసినిమాతో పాటు ధనుష్ తన 50వ సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈసినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: