బెంగళూరు బస్ డిపోలో రజినీకాంత్ సందడి, ఫోటోలు వైరల్

Superstar Rajinikanth Makes Surprise Visit Bengaluru Bus Depot

రజినీకాంత్.. గత కొన్ని దశాబ్దాలుగా తమిళ సినిమా రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వ్యక్తి. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తున్న సూపర్ స్టార్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కేవలం తన కృషితో, పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. సీనియర్, జూనియర్ అన్న భేదం లేకుండా ఎంతోమంది నటీ,నటులు ఆయనతో కలిసి నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఏకంగా కార్పొరేట్ సంస్థలు సైతం తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తుంటాయి. అయితే అలాంటి రజినీకాంత్ నిజ జీవితంలో మాత్రం ఎక్కడా ఆ దర్పాన్ని ప్రదర్శించరు. ఒక సామాన్యుడిలా ప్రజలలో కలిసిపోతారు. తన సింప్లిసిటీ నేచర్ తో పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే..? రజినీ ఎలాంటివాడో చాటిచెప్పే ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంగళవారం (ఆగస్టు 29, 2023) సూపర్‌ స్టార్ రజినీకాంత్ బెంగళూరు జయనగర్ లోని బస్ డిపోను ఆకస్మికంగా సందర్శించారు. డిపోలో రజినీకాంత్ కనిపించడం అక్కడివారిని ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది. రజినీ రాకను గురించి తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ డిపోకు తరలివచ్చారు. ఈ క్రమంలో రజినీ కొద్దిసేపు డిపో ప్రాంగణమంతా కలియతిరుగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బిఎమ్‌టిసి) డిపోలోని డ్రైవర్లు, కండక్టర్లు మరియు హెల్పర్‌లతో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో డిపో సిబ్బంది రజినీతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపారు. మరికొంతమంది సూపర్ స్టార్ తో సెల్ఫీలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

అయితే వారి ఉత్సుకతను గమనించిన రజినీకాంత్ కాదనకుండా అక్కడున్న ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. ఎంతో ఓపికగా వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. కాగా గతంలో సినిమాలలోకి రాకముందు రజినీకాంత్ ఇదే డిపోలో కండక్టర్‌గా పనిచేసిన విషయం బహుశా కొద్దిమందికే తెలిసివుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని తిలకించిన ప్రతి ఒక్కరూ రజినీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ అయినాకూడా మామూలు వ్యక్తిలా సాధారణ ప్రజలతో మమేకమవుతున్న తీరుని చూసి రజినీకాంత్ నిజమైన తలైవా అని ప్రశంసిస్తున్నారు. ఇక ఇటీవలే రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eleven =