భగవంత్ కేసరి నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రానుంది

ganesh anthem song promo out tomorrow

వీరసింహారెడ్డి తరువాత నందమూరి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఫై  అంచనాలు పెంచేసింది.ఇక ఇప్పుడు సాంగ్స్ ను రిలీజ్ చేసే పనిలో పడింది చిత్ర బృదం అందులో భాగంగా వచ్చే నెల 1న ఈసినిమా నుండి గణేష్ అంతేమ్ అనే సాంగ్ విడుదలకానుంది.ఈసాంగ్  లో బాలకృష్ణ,శ్రీ లీల వేసే స్టెప్పులు హైలైట్ కానున్నాయి అంతే కాదు ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందని తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సాంగ్ ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదలకానుందని మేకర్స్ పోస్టర్  ద్వారా తెలిపారు.ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్రలో కనిపించనుంది.అర్జున్ రామ్ పాల్ విలన్ రోల్ చేస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.ఈ దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.భగవంత్ కేసరి కూడా హిట్ అయితే బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.ఇంతకుముందుఅఖండ,వీరసింహారెడ్డి లతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను చూశాడు. మరి ఈ భగవంత్ కేసరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =