మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలోని అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. 1978లో ‘పునాదిరాళ్లు’ అనే తెలుగు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన నేటికీ అగ్ర హీరోగా కొనసాగుతుండటం గమనార్హం. కాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. నేటితో ఆయన 68వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి.. జనసేన పార్టీ అధినేత, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘బర్త్ డే’ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు అన్నయ్య చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ ఒక లేఖను విడుదల చేశారు. అందులో అన్నయ్యపై తనకు గల ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ లేఖలో.. ‘అన్నయ్య చిరంజీవిగారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య..!’ అని పేర్కొన్నారు.
కాగా చిరంజీవి 1955 ఆగస్టు 22న ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి ప్రాంతంలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల శివశంకర వరప్రసాద్ రావుగా జన్మించారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 150కి పైగా చిత్రాలలో నటించారు. ఈ క్రమంలో చిరంజీవి తన నటనతో కోట్లమంది అభిమానాన్ని సంపాదించడంతో పాటు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు, మూడు నంది అవార్డులు మరియు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సహా సౌత్ తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. అలాగే సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనకి 2006లో ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. అలాగే 2022లో, 53వ IFFIలో IFFI ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: