మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్

Megastar Chiranjeevi and UV Creations New Movie Mega157 with Director Vasishta Announced

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నేడు కీలక ప్రకటన చేసింది. చిరంజీవితో కొత్త సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో వారికి మెగా బర్త్ డే గిఫ్టును అందించినట్లయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేయడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న మెగా156 చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాతో వశిష్ట మనకు మెగా మాస్ యూనివర్స్ చూపించబోతున్నారు. విజువల్ గా కట్టిపడేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం (పంచభూతాలు) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి.

ఈ అద్భుతమైన పోస్టర్ మెగా మాస్ యూనివర్స్ కు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచడంలో సినిమా ఒక శక్తివంతమైన సాధనం. ఇందులో ఫాంటసీ జోనర్ సరికొత్త, ఊహాతీతమైన ఎక్స్ పీరియన్స్ ని పంచుతుంది. ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాల్లో చిరంజీవి లాంటి స్టార్ నటిస్తే అది మరింత ఎక్సయిటింగ్ గా వుంటుంది. వశిష్ట తొలి చిత్రం బింబిసారతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఈ సినిమాతో హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌కు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవితో అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న మెగా156ను మాస్టర్ పీస్ గా రూపొందించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.