మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘గాంఢీవధారి అర్జున’. వరుణ్ తేజ్ తొలి సినిమా నుంచీ ఇతర హీరోలకు భిన్నంగా వినూత్న కథాంశాలను ఎంపిక చేసుకుంటూ జయాపజయాలతో నిమిత్తం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా.. ఈరోజు సాయంత్రం రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దీనిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిర్వహించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఆ అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. ట్రైలర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంది. అర్జున్ అనే ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటిస్తుండగా.. ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ కట్టిపడేశాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలుస్తోంది. అంతేకాదు ట్రైలర్ చివరిలో భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్ మనిషేనేమో అన్న డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది. అయితే గత ఏడాది వచ్చిన ‘గని’, అలాగే ‘ఎఫ్ 3’ సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో.. వరుణ్ తేజ్ ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. చూడబోతే ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో వరుణ్ జోడీగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, బేబీ వేద ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. రన్ టైమ్ విషయానికి వస్తే… 2.18 గంటలుగా ఉంది. స్టైలిష్ అండ్ స్లీక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ముఖేష్ జి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. కాగా ‘గాంఢీవధారి.. ‘ ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’తో ఎస్వీసీసీ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: