అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న 41వ ‘ఇండియా డే పరేడ్’లో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు పాల్గొన్నారు. కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వేడుకలు ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో నటి సమంతతో పాటు మరికొంతమంది భారతీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, బాలీవుడ్ నటి, మోడల్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమంత న్యూయార్క్ వీధుల్లో నడుస్తూ ప్రేక్షకులకు చేతులు ఊపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన భారతీయుల దగ్గరకు వెళ్లిన సమంత వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఇక కార్యక్రమంలో భాగంగా సమంత భారీగా హాజరైన ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సమంత వేదికపై ప్రసంగిస్తూ ‘జై హింద్’ అని నినదించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సమంత మాట్లాడుతూ.. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఈరోజు న్యూయార్క్‌లో దేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా గర్వంగా ఉంది. మన దేశ సంస్కృతి ఎంత గొప్పదో ఈరోజు నాకు మరింతగా అర్థమైంది. ఈ క్షణాలు నా మదిలో జీవితాంతం నిలిచి ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చి అరుదైన గౌరవం దక్కేలా చేసిన అందరికీ నా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అలాగే సినీ కెరీర్ ప్రారంభం నుండి తన చిత్రాలను ఆదరిస్తున్నందుకు యుఎస్ ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి సమంత డాన్స్ చేసి అభిమానులను అలరించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: