త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కానున్న ‘బ్రో’

BRO Telugu Movie To Be Out On Netflix On August 25th

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరియు సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘వినోదాయ సిత్తం’ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో ఒక ముఖ్య పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన ప్రముఖ నటుడు సముద్రఖని ఈ ‘బ్రో’ చిత్రాన్ని రూపొందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో కలిసి నిర్మించారు. ఇక భీమ్లానాయక్‌ వంటి హిట్‌ సినిమా తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించడం.. అలాగే ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సాయిధరమ్‌ తేజ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందరి అంచనాలకు తగ్గట్లుగానే గత నెలలో (జులై 28) విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తొలి మూడురోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పవన్‌ కళ్యాణ్ వింటేజ్‌ లుక్‌, స్టైల్, మేనరిజమ్స్‌ కు తోడు ఆయన గత చిత్రాల్లోని హిట్‌ సాంగ్స్‌ తో రూపొందించిన ప్రత్యేక మెడ్లీ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాలోని ఎమోషనల్‌ కంటెంట్‌కు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ముఖ్యంగా సినిమాలో పవన్ ‘టైమ్ ఆఫ్ గాడ్‍’ పాత్రలో కనిపించడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించాడు. కాగా నిజ జీవితంలో వరుసకు మేనమామ, మేనల్లుడు అయిన పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్ తొలిసారి కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం.

ఇక థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన ‘బ్రో’ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. థియేటర్లలో అలరించిన తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ‘బ్రో’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవనుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో మెగా ఫాన్స్ తో పాటు సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ‘బ్రో’ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అంతకు వారం రోజుల ముందే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =