సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తికేయ బెదురులంక 2012

Kartikeya's Bedurulanka 2012 Movie Gets U/A Certificate

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి గుర్తింపు పొందిన ఈ జెనరేషన్ హీరోల్లో కార్తికేయ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనంతరం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. అయితే కార్తికేయ కేవలం హీరోగా మాత్రమే కాకుండా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో సైతం నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ఆయన హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం బెదురులంక 2012. తాజాగా ఈసినిమా నుండి ఓ అప్‌డేట్ వచ్చింది. సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. కాగా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ మరియు లిరికల్ సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా క్లాక్స్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందింది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు నేపథ్యంలో.. అక్కడి ప్రజల్లో ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే కథాంశంగా ఈ మూవీ రూపొందింది. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటిస్తోంది. అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహించారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మించారు. ఇక ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందించారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =