రజినీకాంత్ నటించిన జైలర్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తుంది.రెండు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా మొదటి రోజే 95కోట్ల గ్రాస్ ను రాబట్టి షాక్ ఇచ్చింది.ఇక రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.దాంతో మరో 55కోట్ల వరకు రాబట్టింది.దాంతో రెండు రోజుల్లో 150కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇందులో షేర్ 75కోట్లు.ఈసినిమా 120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో మరో 45కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను అయ్యినట్లే.ఈ ఆదివారంతో ఆఫీట్ ను చేరుకోనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా భారీ లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు జైలర్ ఓవర్సీస్లోనూ అదరగొడుతుంది.ఇప్పటివరకు 33కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది.కేవలం యుఎస్ ఏ లోనే 2మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.ఈ రోజు కూడా జైలర్ అద్భుతమైన వసూళ్లను రాబట్టుకోనుంది.కేవలం తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి.ఈరోజుతో 200కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.కన్నడ స్టార్ శివరాజ్ కుమార్,మలయాళ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రల్లో కనిపించారు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: