సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను రాబట్టుకోవడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకొని షాక్ ఇచ్చింది.మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళ,తెలుగు వెర్షన్ లు కలిపి 95కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో రజినీ కెరీర్ లో రోబో 2.0 తరువాత అత్యధిక ఓపెనింగ్స్ నుర్ రాబట్టిన సినిమాగా జైలర్ రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం ఒక్క తమిళనాడు లోనే కాదు బెంగుళూరు,కేరళ అలాగే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 10కోట్ల గ్రాస్ ను రాబట్టింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో 40శాతం రికవరీ చేసింది.రెండో రోజు కూడా బుకింగ్స్ అదిరిపోయాయి.మరో వైపు లాంగ్ వీకెండ్ కూడా కలిసిరానుంది.దాంతో జైలర్ వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు సృష్టించనుంది.
మొత్తానికి గత కొంత కాలంగా రేస్ లో వెనుకబడిపోయిన రజినీకాంత్ జైలర్ తో మళ్ళీ తన పవర్ ఏంటో చూపించాడు.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: