కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు మేకర్స్ కూడా. రీసెంట్ గానే ఈసినిమా మరో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి ఈసినిమాకు వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈమేరకు తన ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేశాడు. దేవర టీం కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
🖋️🎶 #Devara https://t.co/XWjE6G0gLr
— Devara (@DevaraMovie) August 12, 2023
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: