నటీనటులు : పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్,కేతిక శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్
సంగీతం : థమన్
దర్శకత్వం : సముద్ర ఖని
నిర్మాతలు :టిజి విశ్వప్రసాద్ ,వివేక్ కూచిబొట్ల
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ బ్రో భారీ అంచనాల మధ్య ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.పవన్ తోపాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటించిన ఈసినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశాడు. మరి ఈసినిమా ఎలా వుంది? అంచనాలను అందుకుందా లేదా ఇప్పుడు చూద్దాం.
కథ :
మార్కండేయలు ( సాయి ధరమ్ తేజ్ )చిన్నప్పుడే తండ్రిని కోల్పోతాడు దాంతో ఇంటికి పెద్ద దిక్కు అవుతాడు.అతనికి ఇద్దరు చెల్లెలు ,తమ్ముడు.మార్కండేయులు ఇంట్లోనే కాదు ఆఫీస్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు.బాధ్యతల వల్ల పనికి తప్ప మనుషులకు టైం కేటాయించలేడు.ఈక్రమంలో అనుకోని ప్రమాదంలో మార్కండేయులు మరణిస్తాడు.ఆతరువాత టైం గాడ్ అయిన టైటాన్( పవన్) ను కలుసుకుటుంటాడు.ఆతరువాత పవన్, మార్కండేయులు కి ఓ వరాన్ని ప్రసాదిస్తాడు.ఇంతకీ అందేంటీ? తరువాత ఏం జరిగింది? అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
తమిళంలో హిట్ అయిన వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చింది ఈసినిమా అయితే పేరుకే ఇది రీమేక్ కానీ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు.పైగా త్రివిక్రమ్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే,మాటలు అందివ్వడంతో డైలాగ్స్ బాగా పేలాయి.ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో బ్రో ఎక్కడా డిస్సపాయింట్ చేయలేదు.దేవుడి పాత్ర కావడంతో పవన్ సినిమాలో అప్పడప్పుడు వెచ్చి వెళ్తాడో ఏమో అని అనుకుంటారు కానీ సినిమా ప్రారంభంలో ఒక 15నిమిషాలు తప్ప దాదాపు సినిమా అంతా కనిపిస్తాడు.
ఓ రకంగా చెప్పాలంటే సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు.స్టైలిష్ గా కనబడుతూ తనదైన స్టైల్లో డైలాగ్స్ చెప్పి స్వాగ్ తో థియేటర్ ను షేక్ చేశాడు.ఫ్యాన్స్, పవన్ ను ఎలా చూడాలనుకున్నారో అలా కనిపించాడు.అభిమానులకు బ్రో విపరీతంగా నచ్చేస్తాడు.మిగితా వారని కూడా శాటిస్ఫై చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది.ముఖ్యంగా లాస్ట్ 30 నిమిషాలు భావోద్వేగంతో సాగుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే టైం గాడ్ గా పవన్ సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు.సినిమాకు మెయిన్ ప్లస్ కూడా తనే అలాగే మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ డీసెంట్అనిపించాడు.మిగితా పాత్రల్లో నటించిన కేతిక శర్మ ,ప్రియా ప్రకాష్ వారియర్,వెన్నెల కిషోర్,తనికెళ్ల భరణి తమ పాత్రల పరిధి మేర నటించారు.హాస్య బ్రహ్మ,బ్రహ్మానందం ఓ సీన్ లో కనిపించి సప్రైజ్ చేశాడు.
టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ గా సముద్రఖని మెప్పించాడు.తెలిసిన కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లు మార్పులు చేసి తెర మీదకు తీసుకొచ్చాడు.ఇక థమన్ సంగీతం సినిమాకు మరో హైలైట్ అయ్యింది.సాంగ్స్ డీసెంట్ అనిపించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.ఎడిటింగ్ ఓకే. రన్ టైం తక్కవ ఉండడం కూడా సినిమాకు కలిసొచ్చింది.సినిమాటోగ్రఫీ బాగుంది.నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చు చేశారు.
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన బ్రోలో పవన్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. సినిమాలో చాలా చోట్ల వింటేజ్ పవన్ కనిపిస్తాడు.ఫ్యాన్స్ కు మాత్రం ఈబ్రో తెగ నచ్చేస్తాడు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు ఈసినిమాలో చాలానే వున్నాయి.సో బ్రో అందరికి నచ్చేస్తుంది.
ALSO READ:
BRO Movie Public Talk
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: