తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. దానికి రుజువు చేస్తూ హను రాఘవపూడితో దుల్కర్ చేసిన సీతారామం, అలానే ధనుష్ చేసిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సీతారామం సినిమా అయితే క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాను చేయడానికి రెడీ అయిపోయాడు దుల్కర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు లక్కీ భాస్కర్ అనే క్యాచీ టైటిల్ ను పెట్టారు. ఇక పోస్టర్ దుల్కర్ ఫేస్ ను కవర్ చేస్తూ 100 రూపాయల నోటు కనిపిస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈసినిమా కూడా పీరియాడిక్ డ్రామాగా వస్తున్నట్టు అర్థమవుతుంది. మరి వెంకీ అట్లూరి ధనుష్ సార్ తీసి హిట్ కొట్టాడు… ఈసినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Presenting you #LuckyBaskhar – Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬
Wishing the man of elegance and charm, @dulQuer, a very Happy Birthday! 🎉#HBDDulquerSalmaan #VenkyAtluri @gvprakash @NavinNooli @Banglan16034849 #SaiSoujanya… pic.twitter.com/PgANYt4c6g
— Sithara Entertainments (@SitharaEnts) July 28, 2023
కాగా ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: