నేడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తన సినిమాల నుండి అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తను నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ సూపర రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా పీరియాడిక్ డ్రామాగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ధనుష్ శేఖర్ కమ్ములతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే చాలా రోజుల నుండి ఈసినిమా కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో మంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్ అయితే ఆసక్తికరంగా ఉంది. పోస్టర్లో పెద్ద పెద్ద భవనాలు, గుడిసెలను చూపించారు. అయితే వీటి మధ్య పాత కరెన్సీ నోట్లను ఉంచడం ఆసక్తిని కలిగిస్తోంది. D51 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. మరి ఈసినిమాలో కింగ్ నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాలి.
Happy Birthday @dhanushkraja …#d51 #dhanush #amigoscreations #svcllp pic.twitter.com/FQF8o5ZaMY
— Sekhar Kammula (@sekharkammula) July 27, 2023
కాగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: