ప్రేమ్ కుమార్ ట్రైలర్ రిలీజ్

santosh shoban prem kumar movie trailer out now

గోల్కొండ స్కూల్ సినిమాలో బాలనటుడిగా నటించి పేపర్ బాయ్ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇక అప్పటినుండీ హీరోగా తనను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సంతోష్ శోభన్. నిజానికి సంతోష్ శోభన్ ఎన్ని సినిమాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఆమధ్య ఏక్ మినీ కథ సినిమాతో ఒక హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మరోకథతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిషేక్ మహర్షి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా ప్రేమ్ కుమార్. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ఆగష్ట్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ చూస్తుంటే ఫన్ రైడర్ గా ఉండి ఆకట్టుకుంటుంది. హీరో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు..కానీ ఏదో ఒక అడ్డంగి వస్తుంటుంది.. దాంతో పెళ్లి వద్దనుకుంటాడు.. ఈ లోపు అతని జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది.. మరి ఆతరువాత ఏమైంది.. ఫైనల్ గా హీరో పెళ్లికున్నాడా ?లేదా?అన్నది మిగిలిన కథ..

కాగా ఈసినిమాలో రాశీ సింగ్ రుచిత సాధినేని హీరోయిన్లుగా నటిస్తున్నారు.. కృష్ణ చైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు తదితరులు నటిస్తున్నారు. సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో శివ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.