బేబిపై సుకుమార్ ప్రశంసలు- ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లర్

director sukumar praises on baby movie

సాయి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బేబి. యూత్ ఫుల్ ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈనెల 14వ తేదీన రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. కథ, నటీనటుల పెర్ఫామెన్స్, సంగీతం అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో అందరికీ నచ్చడంతో ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఇక ఈసినిమాపై సెలబ్రిటీలు కూడా ఒక్కొొక్కరూ తమ సోషల్ మీడియా స్పందిస్తున్నారు. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ ఈసినిమాపై ప్రశంసలు కురిపించగా ఇప్పుడు మరో క్రియేటివ్ డైరెక్టర్ కూడా ఈసినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సుకుమార్ తన సోషల్ మీడియా ద్వారాా స్పందిస్తూ చాలా కాలం తరువాత ఇలాంటి అసాధారణమైన రైటింగ్ ను చూస్తున్నాను…. ఖచ్చితంగా ఈసినిమా కొత్త వేవ్ ను తీసుకొస్తుంది.. సినిమా రైటింగ్ లో కొత్త పంథాను తీసుకొస్తుంది.. ఈసినిమాలో ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది నాకు.. ఒక సినిమాలో పరిస్థితులే పాత్రలు మారడం మొదటిసారి చూశాను డైరెక్టర్ సాయి రాజేష్ కు హ్యాట్సాఫ్.. ఎస్కేఎన్, మారుతి లాంటి వాళ్లు ఇలాంటి సినిమాలను నమ్మి ముందుకు తీసుకరావడం పట్ల అభినందిస్తున్నా.. వైష్ణవి కూడా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసింది.. తనది కూడా ఇంతవరకూ రాయని ఐకానిక్ పాత్ర.. ఆనంద్ దేవరకొండ కూడా బ్రిలియంట్ పెర్ఫామెన్స్ చేశాడు.. అశ్విన్ విరాజ్ కూడా బాగా చేశాడు.. ఇంకా విజయ్ బల్గానిన్ సంగీతం ఒక అందమైన విజువల్ గా అలానే సినిమాటోగ్రఫి ఒక మెలోడియస్ ట్యూన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.. మొత్తానికి ఈసినిమా పెద్ద సక్సెస్ అయినందుకు చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

 

View this post on Instagram

 

A post shared by Sukumar B (@aryasukku)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 13 =