ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ వస్తుండటంతో మొదటి నుండీ ఈసినిమాపై భారీ అంచనాలు పెరగడంతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్లీ జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అయిన తరువాత మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈసినిమా కు మిక్డ్స్ టాక్ వచ్చింది. దీనికితోడు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు కూడా తెరపైకి వచ్చాయి. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఒకఎత్త్తైతో మరో వైపు ఈసినిమా ఊపు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ప్రభాస్ సత్తా ఏంటో ఈసినిమాతో మరోసారి రుజువు అవుతుంది. ఈ రిలీజ్ అయి 10 రోజులు అవుతున్నా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో హౌస్ పుల్ బోర్డులు పడటం అంటే మాములు విషయం కాదు. ఇప్పటికే ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దానికి తోడు ఇంకా హౌస్ పుల్ బోర్డ్ లు పడుతూనే ఉన్నాయి. దీంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశమే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతీ సనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా.. హనుమంతుడిగా దేవ్ దత్త నటించారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇంకా ఈసినిమాకు సినిమాటోగ్రఫి కార్తిక్ పళని, సంగీతం.. అజయ్ అతుల్, ఎడిటింగ్.. అపూర్వ మోతివాలే అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: