ఎడిటింగ్ : అపూర్వ మోతివాలే
సినిమాటోగ్రఫీ :కార్తిక్ పళని
సంగీతం : అజయ్ అతుల్
దర్శకత్వం :ఓం రౌత్
నిర్మాతలు : భూషణ్ కుమార్,కృష్ణన్ కుమార్,ప్రసాద్ సుతార్,రాజేష్ నాయర్,వంశీ-ప్రమోద్
రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈసినిమా విడుదలకు ముందు భారీ హైప్ ను క్రీయేట్ చేసింది.అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సెన్సేషన్ సృష్టించింది.ఇంత భారీ అంచనాలతో ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుంది?అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ :
రామాయణం తెలిసినవారికి కథ తెలిసే ఉంటుంది.జానకి(కృతి సనన్)ని,రాఘవుడు(ప్రభాస్ ) వివాహం చేసుకున్న తరువాత తన తండ్రి మాట కోసం జానకి అలాగే తన తమ్ముడి శేషు (సన్నీ సింగ్)తో కలిసి అడవుల్లోకి వనవాసానికి వెళ్తాడు రాఘవుడు.అక్కడ రాఘవుడిని చూసి మనుసుపడుతుంది శూర్పణఖ (తృప్తి).దాంతో నాకు భర్తగా ఉండాలని అడుగుతుంది అయితే రాఘవుడు నాకు వివాహం అయ్యిందని చెప్పి వెళ్ళిపోతాడు.ఈక్రమంలో జానకి చంపాలని శూర్పణఖ విశ్వ ప్రయ్నత్నాలు చేస్తుంది.అయితే ఒకానొక సందర్భంలో శేష్ వేసిన బాణం శూర్పణఖ ముక్కుకు తగులుతుంది.ఆఅవమానంతో లంకకు వెళ్లిన శూర్పణఖ,తన అన్న లంకేశుడు (సైఫ్ అలీ ఖాన్) తో జానకి అందం గురించి గొప్పగా వర్ణిస్తుంది దాంతో లంకేశుడు,జానకిను అపహరించుకువెళ్తాడు.ఆతరువాత వానర సైన్యం తో రాఘవుడు,జానకిని ఎలా దక్కించుకున్నాడు.ఇందులో భజరంగ్(దేవ దత్త నాగే ) ఎలాంటి సహాయం చేశాడు అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
రామాయణం మీద ఇంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి కానీ ఆదిపురుష్ మాత్రం వాటన్నింటి కంటే భిన్నంగా ఉంటుంది.తెలిసిన కథనే అయినా భారీ బడ్జెట్ తో మోడ్రన్ రామాయణంగా తెరకెక్కడంతో థియేటర్లలో కొత్త అనుభూతిని పంచుతుంది.పిల్లలుకు మాత్రం ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా ఇది.
సినిమా ప్రారంభం నుండి ఇంటర్వల్ కార్డు పడే వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను తీర్చిద్దాడు ఓం రౌత్.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు అయితే సినిమాకు హైలైట్ అయ్యాయి.ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్, కృతి సనన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది.ఎక్కడా డిస్సపాయింట్ చేయకుండా ఫస్ట్ హాఫ్ ను డీల్ చేశాడు ఓం రౌత్.ఇందుకు అతన్ని అభినందించాల్సిందే.సెకండ్ హాఫ్ లోకి వెళితే చిన్న చిన్న లోపాలు కనబడుతాయి కానీ సాటిస్ఫై చేస్తుంది.ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది.అదే గాని జరిగివుంటే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండేది.ఓవరాల్ గా చూస్తే ఈఆదిపురుష్ అందరిని అలరిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే రాముడి పాత్రలో ప్రభాస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.తన ఆహార్యం పోస్టర్ లలో కంటే సినిమాలో చాలా బాగుంది.ఇక ఈపాత్రను సమర్ధవంతంగా పోషించాడు.సీత పాత్రలో కృతి సనన్ మెప్పించింది.కాకపోతే ఆమె స్క్రీన్ టైం తక్కువగా వుంది. ప్రభాస్,కృతి సనన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.రావణాసురిడిగా నటించిన సైఫ్ అలీఖాన్ ఓకే అనిపించాడు.ఈ పాత్ర విషయంలోకూడా డైరెక్టర్ ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండు ఇక శేష్,భజరంగ్ పాత్రల్లో నటించిన సన్నీసింగ్,దేవదత్త నాగే వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ గా ఓం రౌత్ ఆదిపురుష్ ను బాగానే డీల్ చేశాడు. రామాయణానికి మోడ్రన్ టచ్ ఇచ్చి తెర మీద కు తీసుకువచ్చాడు ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. అలాగే సినిమాకు పిల్లర్లు గా నిలిచాయి సంగీతం మరియు నేపథ్య సంగీతం.పాటలు సూపర్ అనిపించగా నేపథ్య సంగీతం హై ఇచ్చింది.అజయ్-అతుల్ సంగీతం,సంచిత్ -అంకిత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ ఓకే.సినిమా దాదాపు 3గంటల లెంగ్త్ వున్న ఎక్కడా బోర్ కొట్టదు.నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చు చేశారు.
ఓవరాల్ గా రామాయణం ఆధారంగా వచ్చిన ఈ ఆదిపురుష్ అందరిని మెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
ALSO READ: Adipurush Telugu Movie Review: Modern Representation Of Mythological Epic Ramayana
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: