‘విరూపాక్ష’ సినిమాతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘సిస్టర్స్ (స్ట్రెస్) డే అవుట్’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌తో కూడిన ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో తన సిస్టర్స్ (తన కజిన్స్)తో తీసుకున్న సెల్ఫీలను సాయి ధరమ్ తేజ్ పంచుకున్నాడు. అలాగే వీడియోల నేపథ్యంలో కొన్ని అన్నదమ్ముల సెంటిమెంట్ పాటలను జోడించడం ద్వారా తన సిస్టర్స్ తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తన మామయ్య, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న ‘బ్రో’ సినిమాలో తేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వినోదయ సీతమ్’ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా ఈ ‘బ్రో’ రూపొందుతోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండటం విశేషం. కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అందులో మార్క్ అనే క్యారెక్టర్ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ ప్రాంగణంలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో సాయిధరమ్ తేజ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ‘బ్రో’లో తేజ్ సరసన కేతికా శర్మ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: