ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దానికి తగ్గట్టే ఈసినిమా నుండి ముందు పోస్టర్లు రిలీజ్ చేయగా పోస్టర్లే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు టీజర్ అయితే సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సోషల్ మీడియాలో వ్యూస్ తో దూసుకుపోతుంది. బాలకృష్ణ పుట్టినరోజ సందర్భంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ టీజర్ ఏకంగా 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇంకా మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది. మరి టీజరే ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూాడాలి.
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: