ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈసినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తయి ఇంకా ఈసినిమా గురించి మాట్లాడుతుంటున్నామంటేనే అర్థమవుతుంది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడ మాత్రమే కాదు జపాన్ లో కూడా ఈసినిమా కొత్త రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటిఅక్కడ ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గానే 2 బిలియన్ యెన్స్ కలెక్షన్స్ సొంతం చేసుకొని హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో ఒకటైన హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ 2 ని కూడా బీట్ చేసి మరో రికార్డు సెట్ చేసింది. దీనితో జపాన్ లో భారీ వసూళ్లు కలిగిన ఆల్ టైం ఫారిన్ చిత్రాల్లో టాప్ 7 సినిమాల్లో ఆర్ఆర్ఆర్ స్థానం దక్కించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి.
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: