రామాయణం బేస్ చేసుకొని అన్ని ఇండస్ట్రీల్లో కెల్లా తెలుగులోనే ఎక్కువ సినిమాలు వచ్చాయి.ఇందులో ఎక్కువగా ప్రముఖ దర్శకుడు బాపు డైరెక్ట్ చేసినవే.లవకుశ దగ్గర నుండి నేటి ఆదిపురుష్ వరకు సినిమాలను ఒకసారి పరిశీలిస్తే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవకుశ :
వాల్మీకి రచించిన రామాయణం లోని ఉత్తర కాండ ఆధారంగా రూపొందించంబడింది.సీతారాముల కుమారులు లవ కుశ జీవితాలను వర్ణిస్తూ తెరకెక్కింది ఈసినిమా.ఇందులో రాముడిగా సీనియర్ ఎన్టీఆర్,సీతగా అంజలి దేవి నటించారు.1963లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా చాలా పెద్ద హిట్ అయ్యింది.
సంపూర్ణ రామాయణం :
రామాయణం ఆధారంగా బాపు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో శోభన్ బాబు రాముడిగా నటించగా చంద్రకళ సీతా గా నటించింది.1972లో విడుదలైన ఈసినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది.
సీతా కళ్యాణం :
ఈసినిమాను కూడా బాపునే తెరకెక్కించారు.ఇందులో రవికుమార్ రాముడిగా నటించగా జయప్రద సీతగా నటించింది.ఈసినిమా 1976లో విడుదలై పలు అవార్డులు కూడా గెలుచుకుంది.సీతాకళ్యాణం తరువాత హిందీ,మళయాలం కూడా విడుదలైయింది.
శ్రీరామాంజనేయ యుద్ధం :
బాపు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రాముడిగా సీనియర్ ఎన్టీఆర్ నటించగా సీతగా సరోజ దేవి నటించింది. కెవి మహదేవన్ సంగీతం అందించారు.1975లో ఈసినిమా విడుదలైంది.
బాల రామాయణం :
గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అందరు చిన్న పిల్లలు నటించారు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించగా స్మితా మాధవ్ సీతగా నటించింది.1997లో విడుదలైన ఈసినిమాను ఏం ఎస్ రెడ్డి నిర్మించారు.
శ్రీరామ రాజ్యం :
బాలకృష్ణ రాముడిగా నటించగా నయనతార సీతగా కనిపించింది.బాపు దర్శకత్వం వహించారు.2010లో వచ్చిన ఈసినిమా కమర్షియల్ గా అనుకున్నంత గా సక్సెస్ కాలేకపోయింది కానీ నంది అవార్డులతోపాటు పలు అవార్డులను గెలుచుకుంది.
ఆదిపురుష్ :
రామాయణం ఆధారంగా ఇప్పటివరకు వచ్చిన హై బడ్జెట్ మూవీ ఇదే.సుమారు 500కోట్లతో తెరకెక్కింది.మరో మూడు రోజుల్లో అన్ని భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి.తొలిరోజు 100కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేలానే వుంది.ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: