బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.ఐ డోంట్ కేర్ ట్యాగ్ లైన్.రీసెంట్ గా రిలీజైన టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక కొద్దీ సేపటి క్రితం ఈసినిమా టీజర్ కూడా విడుదలైంది.ఈరోజు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.ఈటీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది.బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్,డైలాగ్స్ తో ఈటీజర్ ను కట్ చేశారు.తెలంగాణ స్లాంగ్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్,థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా ఈటీజర్, సినిమాఫై అంచనాలను మరింతగా పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.యువ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది.బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు.తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా.టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.భగవంత్ కేసరి దసరా బరిలో నిలువనుంది.ఈసినిమా విజయం సాధిస్తే బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.ఇంతకుముందు అఖండ,వీర సింహా రెడ్డి లతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు.మరి భగవంత్ కేసరి బాలకృష్ణకు హ్యాట్రిక్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
నేలకొండ భగవంత్ కేసరి🔥
ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది 😎#NandamuriBalakrishna in & as #BhagavanthKesari
TEASER OUT NOW ❤️🔥– https://t.co/MakPOy07uo#HappyBirthdayNBK@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/DhG2KSmQ0F
— Shine Screens (@Shine_Screens) June 10, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: