పవర్ స్టార్ పవన కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నాడు. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా లోపవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఏప్రిల్ లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో నటిస్తున్న కీలక నటీనటుల పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అర్జున్ దాస్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో మరో టాలెంటెడ్ నటి కూడా భాగమైంది. ఆమె ఎవరో కాదు శ్రియా రెడ్డి. ఓజీ సినిమాలో శ్రియా రెడ్డి నటిస్తున్నట్టు కన్ఫామ్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కాగా విశాల్ నటించిన పొగరు సినిమాలో విలన్ పాత్రలో నటించి ఆ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రియా రెడ్డి. ఆ తర్వాత తెలుగులో శర్వానంద్ హీరోగా వచ్చిన అమ్మ చెప్పింది సినిమాలో నటించింది. అనంతరం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. రీసెంట్ గానే ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాాలా గ్యాప్ తరువాత మళ్లీ ఓజీ సినిమాలో నటించబోతుంది.
Welcome aboard, @SriyaReddy!
Your presence in #OG will be a shocker and a banger. 🤙🏻 #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/YMQwjsSk59
— DVV Entertainment (@DVVMovies) June 13, 2023
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: