విక్రమ్ రాథోడ్ గా విజయ్ ఆంటోని

vijay antony new movie first look released

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోని. ఈసినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి కలెక్షన్స్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా ఒక సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. విక్రమ్ రాథోడ్ గా ఈసినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్ లో ముఖంపై గాయాలతో సీరియస్ లుక్ తో ఉండగా ఎవరో రివాల్వర్ తో ఆయనకు గురిపెట్టడం పోస్టర్ లో కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఇంకా సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నా. అపోలో ప్రొడక్షన్స్, ఎస్ ఎన్ ఎస్ మూవీస్ బ్యానర్లపై రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి ఈసినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. శ్రీ శివగంగ ఎంటర్‌ ప్రైజెస్ వారు ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + five =