అమితాబ్-తలైవా 32 ఏళ్ల తరువాత?

rajinikanth shares screen with amitabh bachchan after 32 years

సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ వయసులో యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ జైలర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈసినిమాతో పాటు లాల్ సలామ్ అనే సినిమాలో కూడా రజనీ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో రజనీ మొయిదీన్ భాయ్ గా నటించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇంకా రజినీకాంత్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రజనీకాంత్ 170వ సినిమా ఇది. ఈసినిమా గురించి ఇప్పటికే పలు ఆసక్తికర వ్యాఖ్యలు తెరపైకి రాగా ఇప్పుడు తాజాగా మరోో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 32 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ చిత్రాల తర్వాత మరోసారి అమితాబ్ తో కలిసి రజనీ స్క్రీన్ పంచుకోనున్నారు. మరి ఇందులో ఎంత నిజముంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =